Abn logo
Sep 10 2021 @ 23:45PM

సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు: మాదాపూర్ DCP

హైదరాబాద్: ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడని ఏబీఎన్‌తో మాదాపూర్ డీసీపీ అన్నారు. ప్రమాదం సమయంలో స్కిడ్ అయి పడినట్టు తెలుస్తుందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉండటంతో సాయి ధరమ్ తేజ్  వెహికిల్ స్కిడ్ అయిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడన్నారు. ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, CT స్కాన్ చేసిన తర్వాత హెల్త్ కడిషన్ తెలుస్తుందని ఏబీఎన్‌తో మాదాపూర్ డీసీపీ అన్నారు.