Abn logo
Sep 19 2020 @ 12:06PM

మరోసారి తలపడుతున్న స్టార్‌ హీరోలు..!

Kaakateeya

ఓసారి వెండితెరపై తలపడ్డ ఆ స్టార్‌ హీరోలు ఇప్పుడు డిజిటల్‌ తెరపై కూడా పోటీ పడబోతున్నారు. ఇంతకూ ఆ స్టార్స్‌ ఎవరో కాదు.. మాధవన్‌, విజయ్‌ సేతుపతి. గతంలో వీరిద్దరూ వెండితెరపై 'విక్రమ్‌ వేద' సినిమాలో పోలీస్‌, గ్యాంగ్‌స్టర్‌గా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిజిటల్‌ రంగంలో మాత్రం వేర్వేరు సినిమాలతో పోటీ పడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. అక్టోబర్‌ 2న అనుష్క, మాధవన్‌ నటించిన 'నిశ్శబ్దం' చిత్రం ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలో సైలెన్స్‌ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఇప్పుడు అదే డేట్‌కి విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన 'కా పే రణసింగం' సినిమా కూడా విడుదలవుతుంది. దీంతో సోషల్‌ మీడియాలో వీరి సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందనే దానిపై ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement