Jun 12 2021 @ 16:38PM

ఆ వార్తలో నిజం లేదు: మాధవన్‌!

రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే! యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో మాధవన్‌ నటించబోతున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయంపై మాధవన్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘లింగుస్తామితో పని చేయడమంటే చాలా  ఇష్టం. కానీ తెలుగులో ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నేను విలన్‌గా నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అంటూ ట్వీట్‌ చేశారు. స్పష్టం చేశారు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో ‘వెట్టాయ్‌’ చిత్రంలో నటించారు.