Abn logo
Jun 6 2020 @ 23:24PM

మాధవీలతా.. ఈ ట్విస్టేంటి?

‘‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను..’’ అని నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఆమె సంతోషానికి కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. కొందరు ఒక అడుగు ముందుకు వేసి అది ఖచ్చితంగా పెళ్లే అని, త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తను బయటికి తెచ్చారు. ప్రస్తుతం తను ఉన్న పార్టీలోని ఓ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతోందని, అందుకే ఆమె అంత సంతోషంగా ఉందని ఆమె పై పోస్ట్ పెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. అయితే ఇప్పుడు నా సంతోషానికి కారణం ‘పెళ్లి’ కాదంటూ సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చింది మాధవీలత.


మరి పెళ్లికాకపోతే.. ఏంటి? సడెన్‌గా ఈ ట్విస్ట్ లేంటి మాధవీలతా..? అంటూ ఇప్పుడు ఆమె అభిమానులు ఆమెకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ మాధవీలత ఏమని వివరణ ఇచ్చిందంటే.. 

‘‘న్యూస్ లో వస్తున్న శుభవార్తలకి సంతోషం

శుభం పలకడం కూడా మంచి శకునమే

అందరికి ఒక విన్నపము

నాకు దమ్ము దైర్యం రెండు ఎక్కువే

ప్రేమించిన పెళ్లి చేసుకున్న దైర్యం గ చెప్తాను

అలాగే అంత దమ్ము దైర్యం ఉన్న మగాడంటేనే ఇష్టపడతా కూడా అంతే కానీ ఇష్టాన్ని ప్రేమని దొంగలా దాచుకుని సమాజానికి భయపడే పిరికివాళ్ళంటే నాకు చిరాకు

మాధవి లతని ప్రేమిస్తున్న పెళ్లి చేసుకుంటా అని దమ్ముగా చెప్పే వాడితోనే స్నేహం కూడా గొప్పగా ఉంటుంది కనుక మీడియా మిత్రులకి

నా అభిమానులకి ఫాలోయర్స్ చెప్పేది

ఏమనగా

కాస్త ఆగండి తొందరపడకండి

ఏదైనా చెప్పే చేస్తాను

నేను పిరికిదాన్ని కాదు

ఆలా అని పిరికివాడిని నేను ఒప్పుకోను .... కనుక

ఇంకా అంత దమ్ము ,దైర్యం ,సాహసం ,సత్తా ,విలువ ,శక్తి ,బలం ,అధికారం ఉన్న మనిషి కనపడలేదు నాకు

ముసుగులో రిలేషన్స్ మైంటైన్ చేసే మనుషులన్నా కూడా నాకు అసహ్యమే

కనుక

ఏదైనా చెప్పి చేస్తాను.

మొన్నామధ్య చావు మేళం న్యూస్ వేశారు

అంత మన మంచికే అన్నట్లు ఇపుడు పెళ్లి మేళం వార్త వేశారు

ఏమో తధాస్తు దేవతలు తదాస్తు అంటే

మీడియా మిత్రులకి మంచి పెళ్లి భోజనం పెడతాము

ఇప్పటికి సెలవు

కొంపదీసి పెళ్లికళ వచ్చేసిందంటారా ????

మీ మీడియా వాళ్ళు నా పెళ్లి చేసిన చేసేస్తారు సుమీ

ప్రేమ తో మీ మాధవీలత’’ అని ఆమె తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.

Advertisement
Advertisement
Advertisement