ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-05-06T06:31:11+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వాలు

 సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శుల విమర్శ

గవర్నర్‌పేట, మే 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఎంజీ రోడ్డులోని ఎంబీ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏప్రిల్‌ 16 నుంచి నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని బుధవారం వామపక్ష పార్టీల నేతలు సందర్శించారు. వారు మాట్లాడుతూ కరోనా రెండోదశ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్న తరుణంలో ప్రభుత్వాలు అరకొర చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ కేంద్రాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ  మాట్లాడారు. ఐసోలేషన్‌ సెంటర్‌ను సందర్శించిన వామపక్ష బృందంలో సీపీఐ (ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్‌, రామకృష్ణ, ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి, పీవోడబ్ల్యూ నాయకురాలు పద్మ, ఆలిండియా ప్రోగ్రసివ్‌ ఫోరం నాయకుడు జమీందర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, పీడీఎ్‌సయూ నాయకులు రవిచంద్ర, ఎం.సీపీఐ నాయకుడు అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-06T06:31:11+05:30 IST