ఒక్క కరోనా కేసు కూడా లేని గ్రామం... ఎక్కడుందంటే...

ABN , First Publish Date - 2021-04-29T11:50:25+05:30 IST

దేశం యావత్తూ కరోనాతో తల్లడిల్లిపోతోంది. బాధితులకు...

ఒక్క కరోనా కేసు కూడా లేని గ్రామం... ఎక్కడుందంటే...

భోపాల్: దేశం యావత్తూ కరోనాతో తల్లడిల్లిపోతోంది. బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ అంతకన్నాలేదు. మరోవైపు కరోనా వ్యాప్తికి కారణమవుతున్న నిర్లక్ష్యం.... ఇవన్నీ పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. అయితే వీటికి భిన్నంగా మధ్యప్రదేశ్‌లోని ఆగర్- మాల్వా గ్రామంలో ఈనాటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 


2020 నుంచి యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో భారత్ కూడా కరోనాకు వణికిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన ఆగర్-మాల్వా గ్రామానికి చెందిన ప్రజలు ఎంతో అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడి చర్యలను కఠినంగా అమలు చేశారు. దీంతో ఈ నాటికీ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలోని మహిళలంతా తమ ఇళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ వస్తున్నారు. ఏ ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లి వచ్చినా తప్పనిసరిగా పరిశుభ్రత పాటిస్తున్నారు. ఇదేవిధంగా గ్రామంలోని కొందరు యువకులు ఒక టీమ్‌గా ఏర్పడి, కొత్తగా ఎవరు వచ్చినా... వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న అనంతరమే గ్రామంలోనికి రానిస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, అనునిత్యం అక్కడ కాపలాగా ఉంటున్నారు.  


Updated Date - 2021-04-29T11:50:25+05:30 IST