మధ్యప్రదేశ్ లో 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-07T02:03:15+05:30 IST

మధ్యప్రదేశ్ లో 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు

మధ్యప్రదేశ్ లో 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కోవిడ్-19 'జుంటా కర్ఫ్యూ'ను మే 15 వరకు పొడిగించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి మేము అన్నింటినీ పూర్తిగా మూసివేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వివాహాలు సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలు, మేలో వివాహాలు నిర్వహించవద్దని ప్రజలను ప్రోత్సహించాలని నేను ప్రజా ప్రతినిధులందరినీ కోరుతున్నానని సీఎం చెప్పారు.

Updated Date - 2021-05-07T02:03:15+05:30 IST