ఆరుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు కరోనా

ABN , First Publish Date - 2020-05-28T11:35:03+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది....

ఆరుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు కరోనా

కంటైన్మెంటు జోన్‌గా రాజ్‌భవన్ 

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది.భోపాల్ నగరంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో వాహనాలు శుభ్రం చేసే క్లీనర్ కుమారుడికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని రిపోర్టులో వచ్చింది. క్లీనర్ కుమారుడు రాజ్‌భవన్ క్వార్టర్స్ లో తండ్రితో పాటు నివాసముంటున్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి అతని నలుగురు కుటుంబసభ్యులను పరీక్షించగా వారందరికీ కరోనా ఉందని తేలింది. వారితో పాటు రాజ్‌భవన్  మరో ఉద్యోగికి కూడా కరోనా ఉందని వెల్లడైంది. దీంతో ఆరుగురిని ఆసుపత్రిలోని క్వారంటైన్ కు తరలించారు. రాజ్‌భవన్ లో కరోనా రోగులు వెలుగుచూడటంతో ముందుజాగ్రత్తగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నరుకు కూడా కరోనా పరీక్షలు చేశారు. గవర్నరుకు కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చిందని గవర్నర్ ప్రెస్ ఆఫీసర్ అజయ్ వర్మ చెప్పారు. భోపాల్ రాజ్‌భవన్ క్వార్టర్స్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఉద్యోగులందరినీ హోం క్వారంటైన్ చేశారు. రాజ్‌భవన్  ప్రాంతాన్ని శానిటైజ్ చేయించారు.రాజ్‌భవన్ లో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ భౌతిక దూరం పాటిస్తూ కరోనా సోకకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని గవర్నర్ ప్రెస్ ఆఫీసర్ అజయ్ వర్మ వివరించారు. 

Updated Date - 2020-05-28T11:35:03+05:30 IST