Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 14 2020 @ 16:40PM

పీఏ బర్త్‌డేకు.. మెర్సిడెస్‌ బెంజ్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ గాయని

లండన్‌: మన దగ్గర పని చేసేవాళ్ల పుట్టిన రోజు అని తెలిస్తే మనం మహా అయితే ఏం చేస్తాం.. విష్ చేయడం, అలాగే ఏదో చిన్న గిఫ్ట్‌లాంటి ఇచ్చి సంతోష పెట్టడం చేస్తాం. ఇక కేక్‌ కట్‌ చేసి చిన్న పార్టీ ఇవ్వడం కూడా గొప్పనే. కానీ, బ్రిటన్‌కు చెందిన యువ గాయని మాడిసన్‌ బీర్‌ తన వద్ద పీఏగా పనిచేస్తున్న మహిళకు ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకునే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. పీఏ 30వ బర్త్‌డే సందర్భంగా లంచ్ ఏర్పాటు చేసిన మాడిసన్ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమెకు ఎప్పటికీ మరిచిపోలేని బహుమానం ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది.


ఇంతకు తన పీఏకు మాడిసన్ ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? అక్షరాల రూ. 30 లక్షల విలువ చేసే న్యూ మెర్సిడెస్‌ బెంజ్‌ సీ 300 కారును కానుకగా ఇచ్చింది. దీంతో పీఏ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన యజమాని ఇచ్చిన ఈ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ను చూసి ఆమె సంతోషంతో ఉబ్బితబ్బి అయిపోయింది. 12 ఏళ్ల పాత కారుతో పీఏ ఇబ్బందులు పడటం చాలాసార్లు దగ్గర నుండి గమనించిన మాడిసన్ ఇలా విలువైన కారును ఆమెకు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ 20 ఏళ్ల యువ గాయనికి యూట్యూబ్‌ వీడియోలు తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement