Abn logo
Apr 8 2021 @ 01:03AM

మ్యాజిక్‌ జరగబోతోంది!

‘‘ఫస్ట్‌ షో పడగానే ‘వకీల్‌సాబ్‌’ మరో లెవల్‌ మూవీ అని మీరే చెపుతారు. మ్యాజిక్‌ జరగబోతోందని బుకింగ్స్‌ చూస్తే తెలుస్తోంది. ఇప్పటిదాకా ఓపెన్‌ చేసిన ప్రతి షోకు టిక్కెట్లు బుక్‌ అయ్యాయి. యూఎస్‌లో కూడా ఇదే పరిస్థితి’’ అని నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.


పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలనే 22 ఏళ్ల కోరిక ‘వకీల్‌సాబ్‌’తో నెరవేరింది. పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్టు ఉంటుంది. కథ, కథనంపై శ్రీరామ్‌వేణు బాగా వర్క్‌ చేశాడు. పింక్‌, తమిళ రీమేక్‌ కన్నా కూడా ‘వకీల్‌సాబ్‌’ చాలా బాగుంటుందని చె ప్పగలను. సినిమా ప్రారంభమైన పావుగంటకు పవన్‌ కల్యాణ్‌ ఎంట్రీ ఉంటుంది. 


శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో త్వరలో అల్లు అర్జున్‌తో ఓ చిత్రం ఉంటుంది. శంకర్‌, రామ్‌ చరణ్‌ సినిమా జూలైలో ప్రారంభ మవుతుంది.

Advertisement
Advertisement
Advertisement