నీళ్ల గ్లాసు ఏమైంది?

ABN , First Publish Date - 2021-05-23T05:30:00+05:30 IST

నీళ్ల గ్లాసును మాయం చేసి, తిరిగి నీళ్లతో సహా టోపీలో లభించేలా చేయవచ్చు. స్నేహితుల ముందు ఈ మ్యాజిక్‌ చేయండి. వాళ్లు ఆశ్చర్యపోతారు.

నీళ్ల గ్లాసు ఏమైంది?

మ్యాజిక్‌ టైమ్‌


నీళ్ల గ్లాసును మాయం చేసి, తిరిగి నీళ్లతో సహా టోపీలో లభించేలా చేయవచ్చు. స్నేహితుల ముందు ఈ మ్యాజిక్‌ చేయండి. వాళ్లు ఆశ్చర్యపోతారు.


కావలసినవి

రెండు ఒకేరకమైన పేపర్‌ కప్పులు, ఒక పేపరు బ్యాగ్‌, నీళ్లు, టేబుల్‌, టోపీ.


ఇలా చేయాలి...

  1. ముందుగా ఒక పేపర్‌ కప్పు అడుగు భాగం కత్తిరించాలి. రెండో పేపర్‌ కప్పు అంచు కత్తిరించాలి. అడుగు భాగం కత్తిరించిన పేపర్‌ కప్పును, అంచు కత్తిరించిన కప్పులో పెట్టి టేబుల్‌పై పెట్టాలి. ఈ పని ముందే చేసి పెట్టుకోవాలి.
  2. స్నేహితులు వచ్చాక టేబుల్‌పై ఉన్న కప్పులో నీళ్లుపోయాలి. టోపీని తీసి చూపించండి. నీళ్లు నింపిన గ్లాసు అందులో పెట్టండి. 
  3. ఇప్పుడు పేపర్‌బ్యాగు తెరిచి దాని అడుగు భాగం వెడల్పుగా చేసి అరచేతిలో పెట్టుకోండి. టోపీలో నుంచి అడుగుభాగం లేని పేపర్‌కప్పుని నెమ్మదిగా పైకి తీసి నీళ్లు ఉన్న కప్పు అనిపించేలా పేపర్‌బ్యాగులో పెట్టండి. కప్పుకి అడుగుభాగం లేదని స్నేహితులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  4. పేపర్‌బ్యాగు పైన మడిచి మ్యాజిక్‌ చేస్తున్నట్టుగా నటించి, ఆ బ్యాగును నలిపేయండి. అందులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఫ్రెండ్స్‌ అందరూ ఆశ్చర్యపోతారు.
  5. అప్పుడు టోపీలోకి చూడండి. అరే! నీళ్ల గ్లాసు ఇక్కడే ఉంది అంటూ పైకి తీయండి. 

Updated Date - 2021-05-23T05:30:00+05:30 IST