Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహాపాదయాత్రకు పులివెందుల రైతుల మద్దతు...

తిరుపతి: ఇప్పటి వరకు పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షన్ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోందని, ఆ సంస్కృతితో విసిగి వేశారమని పులివెందుల రైతులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలో అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతులు సంఘీభావం తెలిపారు. కుప్పం ఎన్నికలతో పాటు మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం ఉందని అన్నారు. ఈ సందర్భంగా పులివెందుల రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పాదయాత్ర గురించి పులివెందుల కాకుండా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల ప్రజలు  ఏపీ రాజధానిగా అమరావతే అనుకూలమైన ప్రాంతమని అనుకుంటున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకునే అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. విశాఖ రాజధానిగా ఉంటే ఎవరినైనా ప్రజాప్రతినిధులను కలవాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల్లో భయభ్రాంతులకు గురిచేసే వాతావరణాన్ని సృష్టించిందని పులివెందుల రైతులు అన్నారు.

Advertisement
Advertisement