Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాల్య వివాహంపై ఫిర్యాదు చేసిన బాలిక

మహబూబాబాద్: బాల్య వివాహం ఇష్టంలేదని అధికారులకు ఫిర్యాదు చేసిన ఇంటర్ విద్యార్థిని లక్ష్మి ప్రసన్నను అందరూ అభినందిస్తున్నారు. ఇప్పుడే వివాహం వద్దని, ఇంకా చదువుకోవాలని ఉందన్న బాలికను మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, మన్నెగూడెంకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. దీంతో ఆ బాలికకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తాను ఉన్నత చదువులు చదువుకోవాలని, పెళ్లి ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలిక ధైర్యంగా మహిళా శిశుసంక్షేమశాఖకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆ పెళ్లిని ఆపారు.

Advertisement
Advertisement