Abn logo
Aug 1 2021 @ 08:45AM

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..47 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ 47 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 4,75,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,80,097 క్యూసెక్కులు కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 316.520 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.973 టీఎంసీలుగా ఉంది.