Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద..12 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-09T12:47:24+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద..12 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం వైపు 81,401 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 88,300 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 84,739 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం: 318.516 మీటర్లుగా ఉండగా.. ప్రస్తుతం 317.740 మీటర్లుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 8.087 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-09T12:47:24+05:30 IST