Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్ సమాచారం

ABN , First Publish Date - 2021-07-23T13:43:35+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్ సమాచారం

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 9 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటీతీ దిగువకు విడుదల చేస్తున్నారు. ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.670 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ  6.202టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 92,100 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో  86,272 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు శ్రీశైలం వైపు 85,240 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-07-23T13:43:35+05:30 IST