వాన జల్లుల్లోనూ ముందుకే..

ABN , First Publish Date - 2021-11-21T08:03:45+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 20వ రోజైన శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో జోరుగా సాగింది. వర్షపు జల్లులు పడుతున్నా లె క్క..

వాన జల్లుల్లోనూ ముందుకే..

  • అమరావతి మహాపాదయాత్రకు జన నీరాజనం
  • 2 రోజుల విరామం అనంతరం పునఃప్రారంభం


ఒంగోలు, కావలి రూరల్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 20వ రోజైన శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో జోరుగా సాగింది. వర్షపు జల్లులు పడుతున్నా లె క్క చేయకుండా పాదయాత్ర బృందం ముందుకు నడిచింది. ప్రతి గ్రామం వద్ద ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చి సంఘీభావంగా యాత్రలో పాల్గొన్నారు. ఈ నెల 17 న కందుకూరు నుంచి గుడ్లూరు వరకూ యాత్రచేసిన బృందం సభ్యులు అక్కడ బస చేశారు. 18, 19 తేదీల్లో కురిసిన భారీవర్షాలతో యాత్రకు వి రామం ప్రకటించారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో శనివారం పునఃప్రారంభించారు. గుడ్లూరులో బస చేసిన శిబిరం వద్ద ఉదయం జే ఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్‌, కొలికపూడి శ్రీనివాసరావు, రాయపాటి శైలజ, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేశ్‌తో కలిసి యాత్రను ప్రారంభించారు. వాననీటితో రోడ్లు బురదమయంగా ఉన్నప్పటి కీ లెక్క చేయకుండా బృందం ముందుకు సాగింది.


మేళతాళాలు, డప్పుల నృత్యాలు, జై అమరావతి నినాదాలతో సాగుతున్న యాత్రకు దారి పొడవునా మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి, వారు పోసి, పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. గుడ్లూరు మండలం చినలాటరిి మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు యాత్రలో పాల్గొన్నారు. రూ.15 లక్షల విరాళం అందించారు.  యాత్ర సాయంత్రం 4గంటలకు నెల్లూరు జిల్లా సరిహద్దుకు చేరుకుంది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ నేతృత్వంలో పెద్దసంఖ్యలో కావలి ప్రాంత ప్రజలు తరలివచ్చి పాదయాత్ర బృందంపై పూల జల్లు కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. 

Updated Date - 2021-11-21T08:03:45+05:30 IST