Advertisement
Advertisement
Abn logo
Advertisement

36వ రోజు ప్రారంభమైన రాజధాని రైతుల పాదయాత్ర

నెల్లూరు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 36వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం వెంగమాంబపురం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది. బంగారుపేట మీదుగా వెంకటగిరికి చేరుకోనుంది. రాజధాని రైతులకు సంఘీభావంగా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, మంగళహారతులు ఇచ్చి, రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా రైతులు నివాళులర్పించారు. ఈ సందర్బంగా రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాలు, నాయకులు, ప్రజలు నడవాలన్నారు. అలాంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయని.. సరిదిద్దుకుని పాలన చేయాలని రైతులు కోరారు. 

Advertisement
Advertisement