Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు జిల్లా: సర్వేపల్లిలో పాదయాత్ర భగ్నానికి వైసీపీ నేతల ప్రయత్నం

నెల్లూరు జిల్లా: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అధికారపార్టీ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు వైసీపీ నాయకులు కలిసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చేరిన యాత్రను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు.


బుధవారం సర్వేపల్లిలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డుంకులు సృష్టించారు. కనీసం భోజనాలు కూడా చేయనివ్వలేదు. ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న పోలీసులు, వైసీపీ నేతలను ఎక్కడా చూడలేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అన్నింటిని ఓర్చుకుని పాదయాత్ర కొనసాగించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ ఘటన నెల్లూరు జిల్లాకే తలవంపులు తెచ్చిందన్నారు. ఈ జిల్లా ఆతిధ్యానికి పెట్టిందిపేరని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అధికారపార్టీ నేతలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు. ఇది మహాపాదయాత్రకాదని, మహా యుద్ధమని ఆంజనేయులు అన్నారు.

Advertisement
Advertisement