Abn logo
May 17 2021 @ 12:24PM

కోవిడ్‌కేర్ సెంట‌ర్ లో వృద్ధునికి ఊహించ‌ని కానుక‌!

థానె: మహారాష్ట్రలోని ఒక కోవిడ్ కేంద్రంలో క‌రోనాకు చికిత్స పొందుతున్న ఒక వృద్ధునికి అనూహ్య‌మైన కానుక ల‌భించింది. ఆ కేంద్రంలో ప‌నిచేస్తున్న వైద్య సిబ్బంది ఆ వృద్ధుని పుట్టిన‌రోజును ఘ‌నంగా నిర్వ‌హించారు.  క‌రోనా బాధితుడు మహేశ్వర్ పాట్కర్‌కు 70 ఏళ్లు నిండాయి. ఈ విషయం కోవిడ్ సెంటర్ సిబ్బందికి తెలియగానే... వారు వెంటనే కేక్ తెప్పించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ కోవిడ్ సెంట‌ర్‌ ఉస్గావ్‌లో ఉంది  ఈ కేంద్రం మే ఒక‌టిన‌ ప్రారంభమైంది. 

రోగులకు ఈ కేంద్రంలో అన్ని వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని కేంద్రం నిర్వాహ‌కుల తెలిపారు. ఇదిలావుండ‌గా మహారాష్ట్రలోని థానె జిల్లాలో కొత్తగా 1,314  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో జిల్లాలో క‌రోనా కేసుల సంఖ్య‌ ఐదు లక్షలు దాటింది. జిల్లాలో క‌రోనా కారణంగా 49 మంది మృతి చెందారు. థానేలోని కోవిడ్ -19 మరణాల రేటు 1.69 శాతంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 8,476 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రత్యేకంమరిన్ని...

Advertisement