యూనివర్శిటీ చివరి సంవత్సరం పరీక్షలనూ రద్దు చేసిన మహారాష్ట్ర

ABN , First Publish Date - 2020-06-02T00:16:51+05:30 IST

రాష్ట్రంలోని యూనివర్శిటీ విద్యార్థుల చివరి సంవత్సరం పరీక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

యూనివర్శిటీ చివరి సంవత్సరం పరీక్షలనూ రద్దు చేసిన మహారాష్ట్ర

ముంబై: రాష్ట్రంలోని యూనివర్శిటీ విద్యార్థుల చివరి సంవత్సరం పరీక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. కరోనా మహమ్మారి విలయతాండవం నేపథ్యంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మునుపటి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన సగటు మార్కుల ఆధారంగా వారిని పై తరగతులకు ప్రమోట్ చేస్తామని తెలిపింది. ఈ విధానంలో నష్టపోయామని భావించిన వారికి భవిష్యత్తులో సాధరణ పద్ధతిలో పరీక్షలూ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా చివరి సంవత్సరం విద్యార్థులకూ ఈ సౌలభ్యం కల్పించింది. అంతకుమునుపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాకరే.. యూనివర్శిటీ వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని ఆదేశిస్తూ దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు ఊరట నిచ్చే నిర్ణయం తీసుకున్నారు. గత సెమీస్టర్లలో విద్యార్థులు సాధించిన సగటు మార్కుల ఆధారంగా వారిని ప్రయోట్ చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-06-02T00:16:51+05:30 IST