మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-13T18:09:04+05:30 IST

కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. ముందస్తు చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించింది మహారాష్ట్ర సర్కార్.

మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

ముంబై: కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. ముందస్తు చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించింది మహారాష్ట్ర సర్కార్. గత లాక్‌డౌన్‌ మే 15వ తేదీ వరకు విధించగా... ఇప్పుడు దాన్ని జూన్ 1 ఉదయం 7 గంటల వరకు పొడిగించింది. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి అని మరోసారి స్పష్టం చేసింది. కరోనా ఉధృతిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయకతప్పదని ఉద్దవ్ సర్కార్ భావిస్తోంది. 


ఇదిలా ఉంటే, కరోనా కేసుల సంఖ్య మహారాష్ట్రలో తగ్గుముఖం పడుతోంది. దేశంతో పోలిస్తే.. కోవిడ్ కేసుల పెరుగుదల రేటులో సగం నమోదు అవుతున్నాయి. దేశంలో 1.4 శాతం ఉంటే ... మహారాష్ట్రలో 0.8శాతం ఉంది. టెస్టుల్లోనూ మహా సర్కార్ ముందుంది. రోజూ సుమారు 2 లక్షల కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయని.. గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి తోపే అన్నారు. 

Updated Date - 2021-05-13T18:09:04+05:30 IST