సీబీఐకి మహారాష్ట్ర సర్కారు సాధారణ అనుమతి ఉపసంహరణ

ABN , First Publish Date - 2020-10-22T08:19:00+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఇచ్చిన సాధారణ అనుమతిని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో సీబీఐ కేసుల దర్యాప్తు అధికారానికి అవరోధం ఏర్పడనుంది...

సీబీఐకి మహారాష్ట్ర సర్కారు సాధారణ అనుమతి ఉపసంహరణ

ముంబై, అక్టోబరు 21: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఇచ్చిన సాధారణ అనుమతిని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో సీబీఐ కేసుల దర్యాప్తు అధికారానికి అవరోధం ఏర్పడనుంది. ఏదైనా కేసులో దర్యాప్తును ప్రారంభించాలనుకుంటే సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేసును బట్టి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంచనుంది. ఇంతకు ముందు పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణానికి సంబంధించిన కేసు ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే తర్వాత ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-10-22T08:19:00+05:30 IST