నాలుగు ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ‘మహా’ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-03T02:02:11+05:30 IST

కరోనావైరస్ రోగుల చికిత్స కోసం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ముంబైలోని

నాలుగు ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ‘మహా’ ప్రభుత్వం

ముంబై: కరోనావైరస్ రోగుల చికిత్స కోసం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ముంబైలోని నాలుగు ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం షో నోటీసులు జారీ చేసింది. వీటిలో బాంబే ఆసుపత్రి, జస్‌లోక్ ఆసుపత్రి, హిందూజా ఆసుపత్రి, లీలావతి ఆసుపత్రి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ హెడ్ డాక్టర్ సుధాకర్ షిండే హెచ్చరించారు. ఆసుపత్రులలో 50 శాతం పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ రోగులు ప్రైవేటు ఆసుపత్రులలో ఎక్కువసేపు వేచి ఉంటున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే సోమవారం ఆసుపత్రుల సందర్శన సందర్భంగా గ్రహించారు.   


‘‘కోవిడ్-19 రోగుల కోసం ఖాళీగా ఉన్న పడకలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఆసుపత్రులు వెల్లడించలేదు. కోవిడ్-19 చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల వివరాలను కూడా ప్రదర్శించలేదు. ఆసుపత్రులలో 50 శాతం పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ రోగులు చాలామంది రోగులను చాలా సేపు వేచి చూసేలా చేస్తున్నారు’’ అని ప్రజారోగ్య విభాగం పేర్కొంది.   

Updated Date - 2020-06-03T02:02:11+05:30 IST