మహారాష్ట్రకు కోటి వ్యాక్సిన్ డోసులను పంపాం : జవదేకర్

ABN , First Publish Date - 2021-04-11T01:43:17+05:30 IST

మహారాష్ట్రకు ఇప్పటి వరకూ 1.10 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

మహారాష్ట్రకు కోటి వ్యాక్సిన్ డోసులను పంపాం : జవదేకర్

ముంబై : మహారాష్ట్రకు ఇప్పటి వరకూ 1.10 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఉందని ఆరోగ్య మంత్రి రాకేశ్ తోపే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జవదేకర్ పై ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో మరో రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ కోటి వ్యాక్సిన్ డోసులను పంపించామని తెలిపారు. ఇలా కోటి వరకూ వ్యాక్సిన్లను అందుకున్నవి దేశంలో మూడే మూడు రాష్ట్రాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాలు చేస్తోందని, అందుకు ఇది సరైన సమయం కాదన్నారు. ఒకవేళ రాజకీయమే చేయదలిస్తే ఆరోపణలకు సరైన సమాధానమివ్వాలని శివసేనకు చురకలంటించారు. ప్రజల శ్రేయస్సు కంటే ఏదీ తమకు ముఖ్యం కాదని  అంతేకాకుండా మరో మూడు రోజుల్లో మహారాష్ట్ర కోసం 1,100 వెంటిలేటర్లను కూడా సిద్ధం చేస్తున్నామని జవదేకర్ వెల్లడించారు. 


Updated Date - 2021-04-11T01:43:17+05:30 IST