high alert: జికా వైరస్‌పై అధ్యయనానికి కేంద్ర బృందం

ABN , First Publish Date - 2021-08-06T13:47:55+05:30 IST

జికా వైరస్ మొదటి కేసు నమోదైన మహారాష్ట్రలో ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం పలు చర్యలు...

high alert: జికా వైరస్‌పై అధ్యయనానికి కేంద్ర బృందం

ముంబై (మహారాష్ట్ర): జికా వైరస్ మొదటి కేసు నమోదైన మహారాష్ట్రలో ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జికా వైరస్ ప్రబలకుండా మహారాష్ట్ర సర్కారు హైఅలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలో జికా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన వైద్యనిపుణుల ప్రత్యేక బృందాన్ని పంపించింది. పూణే జిల్లాలోని బేలాసర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు జికా వైరస్ సోకిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జరిపిన పరీక్షల్లో తేలింది. జికా వైరస్ నుంచి మహిళ కోలుకున్నా, ఈ వైరస్ ప్రబలకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. పూణే జిల్లాలో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందం జికా వైరస్ పై నివేదిక సమర్పించనుంది.కేంద్ర బృందంలో పూణే వైద్యనిపుణుడైన రీజనల్ డైరెక్టర్, ఢిల్లీలోని లేడీ హార్డింగ్ వైద్యకళాశాల గైనకాలజిస్ట్, ఢిల్లీలోని మలేరియా పరిశోధనా సంస్థ ఎంటమాలజిస్ట్ లున్నారు. వైద్యనిపుణుల బృందం పూణే జిల్లాలో పర్యటించి జికా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేశారు. 


Updated Date - 2021-08-06T13:47:55+05:30 IST