Abn logo
Jul 2 2020 @ 11:29AM

మహారాష్ట్ర జైళ్లలో కరోనా కలకలం..363 మందికి పాజిటివ్

100మంది జైలు సిబ్బందికి కరోనా

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని జైళ్లలో 363 మంది ఖైదీలు, 102మంది జైలు అధికారులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. జైళ్లలో నలుగురు ఖైదీలు కరోనా వల్ల మరణించారు. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకడంతో పలు జైళ్లలో కలకలం రేగింది. ముంబై నగరంలోని సెంట్రల్ జైలులో అత్యధికంగా 181 మంది ఖైదీలు, 44 మంది జైలు సిబ్బందికి కరోనా వచ్చిది. పలు జైళ్లలో 255 మంది ఖైదీలు, 82 మంది జైలు ఉద్యోగులు కరోనా నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర జైళ్ల శాఖ వెల్లడించింది. ముంబైతో పాటు థానే సెంట్రల్ జైలు, తలోజా కేంద్ర కారాగారం, బైకుల్లా జిల్లా జైలు, ఎరవాడ సెంట్రల్ జైలు,ఔరంగాబాద్ సెంట్రల్ జైలు, సతారా జిల్లాజైలు, షోలాపూర్, రత్నగిరి, అకోలా, థూలే జిల్లా జైళ్లలో ఖైదీలు కరోనా బారిన పడ్డారని మహారాష్ట్ర జైళ్ల శాఖ వెల్లడించింది. 

Advertisement
Advertisement
Advertisement