caseload high :మహారాష్ట్ర 8 జిల్లాల్లో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-07-12T15:33:52+05:30 IST

మహారాష్ట్రలో కరోనా మరో సారి కల్లోలం రేపుతోంది...

caseload high :మహారాష్ట్ర 8 జిల్లాల్లో కరోనా కల్లోలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా మరో సారి కల్లోలం రేపుతోంది. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 8,535 కరోనా కేసులు వెలుగుచూడగా, 156 మంది వైరస్‌తో మరణించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నా, 8 జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్ గడ్, సింధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం కొల్హాపూర్ జిల్లాలో 1,097 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. సాంగ్లీ జిల్లాలో 1,097, సాతారాలో 755, రత్నగిరిలో 455, పూణే రూరల్ పరిధితోపాటు పింప్రీ చంచ్ వాద్ లో 1,072 కరోనా కేసులు వెలుగుచూశాయి. 


మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు కరోనా పరీక్షలసంఖ్య కూడా పెంచారు. కొల్హాపూర్ జిల్లాలో మొత్తం 19,034 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. సాంగ్లీ జిల్లాలో 11,717, సాతారాలో 8,505, రత్నగిరి జిల్లాలో 3,569 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొల్హాపూర్ జిల్లాలో కరోనాతో మరణించిన వారి శాతం కూడా ఎక్కువగానే ఉంది. 2.9 శాతం మంది కొల్హాపూర్ జిల్లాలో మరణించారు. 8 జిల్లాల్లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కరోనా హాట్ స్పాట్లను గురించి పరీక్షలు చేసి కరోనా రోగులను ఐసోలేషన్ లో ఉంచుతున్నామని డాక్టర్ ప్రదీప్ అవధీ చెప్పారు.


Updated Date - 2021-07-12T15:33:52+05:30 IST