మహారాష్ట్రలో కరోనా విలయం.. ఒక్కరోజులో 2,435 కేసులు

ABN , First Publish Date - 2020-05-26T02:27:09+05:30 IST

దేశం మొత్తం కరోనా విజృంభిస్తోంది. అయితే మహారాష్ట్రలో మాత్రం ఈ వైరస్ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ వేల మంది ప్రజలను..

మహారాష్ట్రలో కరోనా విలయం.. ఒక్కరోజులో 2,435 కేసులు

ముంబై: దేశం మొత్తం కరోనా విజృంభిస్తోంది. అయితే మహారాష్ట్రలో మాత్రం ఈ వైరస్ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ వేల మంది ప్రజలను కబళిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. ఈ రోజు కూడా  2,400కు పైగా కోవిడ్-19 పాజిటివ్ బాధితులను ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,435 కరోనా కేసులు నమోదయ్యాయి. 60 మంది మరణించారు. 1,186 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 52,667కు చేరింది. 1,695 మంది మరణించారు. 15,786 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 35,186 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-26T02:27:09+05:30 IST