మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శం

ABN , First Publish Date - 2022-01-24T04:58:45+05:30 IST

సమాజంలోని వారికి వాల్మీకి మహర్షి ఆదర్శమని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శం
వాల్మీకి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన నాయకులు

-  ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- వివిధ సంఘాల క్యాలెండర్ల ఆవిష్కరణ


పాలమూరు, జనవరి 23 : సమాజంలోని వారికి వాల్మీకి మహర్షి ఆదర్శమని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో వా ల్మీకి దేవాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న దేవాలయానికి రూ.10 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 2022 సంవ త్సరపు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షు డు జి.రామలక్ష్మణ్‌, యం.కృష్ణయ్య, జడ్పీ సీఈవో మొగులప్ప, వెంకట్రాములు, ఎస్‌.సురేష్‌బాబు, పెద్ద నరసింహులు, బండల శ్రీను, చైర్మన్‌ కె.సి నరసింహులు, శ్రీనివాస్‌, రవికుమార్‌, పి.వంశీకృష్ణ పాల్గొన్నారు. 


వ్యవసాయ మార్కెట్‌లకు పూర్వవైభవం


తెలంగాణ ప్రభుత్వంలోనే వ్యవసాయ మార్కెట్‌లకు పూర్వవైభవం వచ్చిం దని రాష్ట్ర ఆబ్కారిశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణం లోని వ్యవసాయ మార్కెట్‌లో దడవాయి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకు లు మంత్రిని ఘనంగా సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ హమాలీ కార్మికు లకు హమాలీ రేటు రూ.2 నుంచి రూ.4.50లకు ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. మార్కెట్‌లో తొందరలోనే రూ.5లకే భోజనం ఏర్పాటు చేస్తామని మం త్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ కె.సీ నరసింహులు, వైస్‌ చైర్మన్‌ టి.గ ణేష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, కౌన్సిలర్లు గోవిం దు,రామలక్ష్మణ్‌, మోసీన్‌, వెంకట్రాములు, నాయకులు ఖాజాపాషా పాల్గొన్నారు. 


పలుచోట్ల 2022 క్యాలెండర్‌ ఆవిష్కరించిన మంత్రి


రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలులో బీసీ మేధావుల సంఘం 2022 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఆరెకటిక సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా.రమేష్‌ సరోడే, డిబి కోదండపాణి, బందులాల్‌, మోహన్‌లాల్‌, ఎన్‌.ప్రభాకర్‌, బాబులాల్‌, బి.పాండురంగం, వెంకటేష్‌, నవీన్‌లు పాల్గొన్నారు. అబ్దుల్‌ఖాదర్‌ దర్గా దగ్గర మత పెద్దలు నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పట్టణంలోని టీఎన్‌జీవోస్‌ భవనంలో మాలల చైతన్య సమితి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేశవులు, బ్యాగరి వెంకటస్వామి, గోపాల్‌, బి.శ్రీనివాసులు, యాదయ్య, రవికుమార్‌; సుదాకర్‌, ఆంజనేయులు, కృష్ణయ్య, నాగయ్య, కాంతారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:58:45+05:30 IST