Abn logo
May 31 2020 @ 09:21AM

మ‌హేశ్ 27 అఫీషియ‌ల్‌... ‘స‌ర్కారు వారి పాట‌’

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ టైటిల్ లోగోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మ‌హేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌పై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి  పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement