Abn logo
May 27 2020 @ 22:22PM

మహేష్ బాబు.. ఏమున్నాడురా బాబూ!

సూపర్ మహేష్ బాబు ఈ లాక్‌డౌన్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఎవరైనా ఏదైనా చేసి ఆశ్చర్యపరుస్తారు. కానీ మహేష్ బాబు మాత్రం తన అందంతో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ లాక్‌డౌన్‌లో తన పిల్లలతో కలిసి మహేష్ బాబు కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలలో మహేష్ బాబును చూసిన వారంతా గౌతమ్‌కు అన్నగా ఉన్నాడు అని అంటున్నారు కానీ.. గౌతమ్ తండ్రి అని మాత్రం అనడం లేదు. అంతగా మహేష్ తన అందంతో మాయ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏమున్నాడురా.. బాబూ.. అని పక్కా మాస్‌గా మాట్లాడుకునేలా మహేష్ తయారయ్యాడు.


తాజాగా మహేష్ బాబు తన కూతురుతో కలిసి సెల్ఫీ దిగుతోన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు ఈ ఫొటోలో మహేష్‌ను చూసిన వారు కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా ఉన్నాడు. నిజంగా మహేష్ బాబేనా? అనేలా మహేష్ హెయిర్ స్టైల్, లుక్.. అబ్బో ఒక్కటేమిటి? మహేష్ యంగ్ ఏజ్‌లో కూడా ఇలా ఉండి ఉండడేమో! అలా ఉన్నాడు మరి. ‘‘మా ప్రతిబింబాలను కనుగొంటున్నాం.. సితార ఘట్టమనేనితో మిర్రర్ సెల్ఫీ క్రియేట్ చేస్తున్నాం..’’ అంటూ మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రమ్‌లో మహేష్, సితార మిర్రర్‌లో సెల్ఫీ తీసుకుంటున్న పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.


Advertisement
Advertisement
Advertisement