మహేశ్‌బాబు, రామ్‌చరణ్ మల్టీస్టారర్.. దర్శకుడెవరు?

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ స్ఫూర్తితో.. పలువురు దర్శకులు టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్స్ ప్లాన్ చేస్తూండడం నిజంగా గొప్ప పరిణామం. ఈ క్రమంలో పలు క్రేజీ కాంబినేషన్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. అందులో ఒకటి మహేశ్‌బాబు - రామ్‌చరణ్ మల్టీస్టారర్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనున్నట్టు సమాచారం. ఇంకా ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ అభిమానులు ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చబోతున్నట్టు సమాచారం. 


ఇంకా ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్ లోనే తమిళ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ సినిమా తీయబోతున్నట్టు సమాచారం అందుతోంది. మరి మహేశ్, చరణ్ ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో చేయడానికి ఉత్సాహం చూపిస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది.  మహేశ్ ఆల్రెడీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీతో వెంకీతో నటించారు. చెర్రీ సైతం యన్టీఆర్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో నటించారు. అందుకే ఈ ఇద్దరు మల్టీస్టారర్ స్టార్స్ .. తొలిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకోనుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే మహేశ్, చరణ్‌ల మల్టీస్టారర్ తెరకెక్కుతుందో లేదో చూడాలి. 

Advertisement
Advertisement