Abn logo
Nov 29 2020 @ 01:13AM

ఢిల్లీ క్రైమ్‌కు మహేశ్‌ ప్రశంసలు

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నేపథ్యంలో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ ‘ఢిల్లీ క్రైమ్‌’. టెలివిజన్‌ పరిశ్రమకు సంబంధించి ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఎమ్మీ అవార్డ్‌ను ‘ఢిల్లీ క్రైమ్‌’ గెలుచుకుంది. బెస్ట్‌ డామ్రా సిరీస్‌ విభాగంలో ఈ అవార్డ్‌ను పొందింది. తొలిసారి భారతదేశంలో నిర్మించిన వెబ్‌సిరీస్‌ ఎమ్మీ అవార్డ్‌ను గెలుచుకోవడంపై పలువురు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు నటుడు మహేశ్‌బాబు కూడా చిత్రబృంధాన్ని ట్విట్టర్‌లో ప్రశంసించారు. ఎమ్మీ అవార్డ్‌ను గెలుచుకోవడం ఓ పెద్ద విజయంగా ఆయన పేర్కొన్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌ను దర్శకుడు రిచీ మెహతా తెరకెక్కించారు. ‘నిర్భయకు, న్యాయం కోసం పోరాడిన ఆమె తల్లికి అలాగే మహిళలపై పురుషులు సాగిస్తోన్న హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ప్రతి మహిళకూ ఈ చిత్రం అంకితమిస్తున్నాను’ అని రిచీ మెహతా చెప్పారు. ఇందులో షెఫాలి షా, రషిఖా దుగ్గల్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement
Advertisement
Advertisement