May 15 2021 @ 17:37PM

మహేశ్ బాబు వెంటనే కాల్ చేస్తారు : సుధీర్ బాబు

నేను నటించిన సినిమా నచ్చితే వెంటనే మహేష్ బాబు కాల్ చేసి అభినందిస్తారని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో సుధీర్ బాబు చెప్పాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి శివ మనసులో శృతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ప్రేమ కథా చిత్రంతో సూపర్ హిట్ అందుకొని గుర్తింపు తెచ్చుకున్న ఈయన భలే మంచి రోజు, మోసగాళ్ళకు మోసగాడు, శమంతకమణి, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి డిఫ్రెంట్ సినిమాలలో నటిస్తూ డీసెంట్ హిట్స్ అందుకున్నాడు. తను నటించిన సినిమా మహేష్ తప్పకుండా చూస్తాడని..నచ్చితే ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందిస్తారని అలాగే కృష్ణ గారు చిన్నగా నవ్వి ఊరుకుంటారని తెలిపాడు. 

'వి' లాంటి మల్టీస్టార్ చేసేందుకు ముందుండే సుధీర్ బాబు బాలీవుడ్‌ సినిమా భాగీలో నటించి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'పలాసా' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'శ్రీదెవీ సెంటర్'లో నటిస్తుండగా.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా విడుదలయిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక ఎప్పటి నుంచో మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆతృతగా ఉన్నాడు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.