Abn logo
Jul 8 2020 @ 17:00PM

మేక‌ప్ మేన్‌కు బ‌ర్త్ డే విషెష్ చెప్పిన మ‌హేశ్‌

సూపర్‌స్టార్ మ‌హేశ్ త‌న కుటుంబ స‌భ్యులతో పాటు త‌న స్టాఫ్ విష‌యంలోనూ కేర్ తీసుకుంటూ ఉంటారు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణగా మ‌హేశ్ త‌న మేక‌ప్ మేన్ ప‌ట్టాభికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. ‘షూట్ మొద‌లైనప్ప‌టి నుండి లాస్ట్ ట‌చ్ వ‌ర‌కు నాతో ఉండే ప‌ట్టాభి ఎప్పుడూ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు మ‌హేశ్‌. ప‌ట్టాబి ఎన్నో సంవ‌త్స‌రాలుగా మ‌హేశ్‌కు ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మేక‌ప్‌మేన్ బ‌ర్త్ డే గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు తెలిపిన మ‌హేశ్‌ను నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు. ప్ర‌స్తుతం మహేశ్ త‌న 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement