Jul 21 2021 @ 10:08AM

Sarkaru Vaari Paata: హర్ట్ అయిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీకి సంబంధించి వస్తున్న లీకులపై మహేష్ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ 27వ చిత్రంగా 'సర్కారు వారి పాట' రూపొందుతున్న విషయం తెలిసందే. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో మొదలైనప్పటినుంచి తాజా షెడ్యూల్ వరకూ సెట్‌లోని కొన్ని పిక్స్ లీకవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో ఓ డైలాగ్ వీడియో కూడా లీకై వైరల్ అవుతోంది. ఇది మహేష్ బాబుని బాగా హర్ట్ చేసిందట. దాంతో చిత్ర బృందానికి ఇకపై 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించి ఏదీ లీకవకుండా జాగ్రత్తలు తీసుకోమని గట్టిగా చెప్పినట్టు సమాచారం. ఇప్పటికైనా ఈ మూవీకి లీకులబెడత తప్పుతుందా లేదా చూడాలి. కాగా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక మోసాల నేపథ్యంలో 'సర్కారు వారి పాట'ను తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీనుంచి ఫస్ట్ లేదా టీజర్ రిలీజయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.