Abn logo
Sep 25 2021 @ 15:11PM

‘జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవే’

హైదరాబాద్: బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విలేజ్, మండల కమిటీ, జిల్లా స్థాయి, రాష్ట్ర కమిటీలు పార్టీకి అవసరమన్నారు. జగ్గారెడ్డి నిన్న మాట్లాడిన మాటలపై వివరణ ఇచ్చారు దానిపై కూడా చర్చించామన్నారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే నిన్నటి వివాదమన్నారు. జగ్గారెడ్డి మీద అధిష్టానం సీరియస్ అనేది అవాస్తమని చెప్పారు. నిన్నటి ఎపిసోడ్‌కు జగ్గారెడ్డి ఫుల్ స్టాప్ పెట్టాడన్నారు. రెండు వైపుల తప్పులున్నాయన్నారు.  కింది క్యాడర్ పరేషాన్ కానవసరం లేదని ఆయన చెప్పారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవేనన్నారు.