Sep 25 2021 @ 16:41PM

మహేశ్‌కి నెర్వస్‌ ఫీలింగ్‌ ఎందుకు?

సినిమా షూటింగ్‌ లేదంటే పూర్తిగా ఫ్యామిలీమ్యాన్‌ అయిపోతారు సూపర్‌స్టార్‌ మహేశ్‌. దొరికిన గ్యాప్‌లో ఫ్యామిలీతో ట్రిప్‌ వేసి జాలీగా గడుపుతుంటారు. ఆ సరదాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఆయన సోషల్‌ మీడియా వాల్‌ మీద తన గారాలపట్టి సితార ఆటపాటల్ని, అల్లరిని పోస్ట్‌ చేస్తుంటారు. ఈ విషయాలను నమ్రత కూడా ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేస్తుంటారు. అయితే సితారను సినిమాల్లోకి  తీసుకొచ్చే ఆలోచన, ఆమెతో నటించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఎన్నోసార్లు సమాధానం ఇవ్వకుండా జారుకునేవారు. తాజాగా  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘సితారతో కలిసి నటించాలంటే కొంచెం నెర్వస్‌గా ఉంటుంది. అయినా తాను తెలుగు సినిమాలు చేయదట .. ఇంగ్లీష్‌ సినిమాలే చేస్తుందట’’ అంటూ సూపర్ స్టార్  నవ్వేశారు.


అయినా వాళ్లను బలవంతంగా ఏ పని చేయనివ్వను. నా అభిప్రాయాలను, ఇష్టాలను వాళ్లపై రుద్దను. ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. వాళ్లకు ఇష్టమైన మార్గంలో  నడవమని ఎప్పుడూ చెబుతుంటా. చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తానంటే ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ల ఇష్టాన్ని కాదనను అని మహేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారువారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. అలాగే రాజమౌళితోనూ ఓ సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపారు.