కరోనా కారణంగా కొన్ని నెలలు థియేటర్లు బంద్ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇంకా కరోనా భయం ఉండడంతో చాలా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవడం లేదు. ఈ రోజు (శుక్రవారం) నుంచి హైదరాబాద్‌లోని మహేష్ బాబు `ఏఎమ్‌బీ మాల్` తెరుచుకోబోతోంది.
పూర్తి స్థాయి భద్రత, కరోనా ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ మల్టీప్లెక్స్‌ను నిర్వహించబోతున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. తాజాగా మహేష్ కూడా ఏఎమ్‌బీ గురించి ట్వీట్ చేశాడు. `ఏఎమ్‌బీ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రేక్షకులందరికీ భద్రతతో కూడిన అందమైన అనుభవాన్ని అందించేందుకు ఏఎమ్‌బీ స్టాఫ్ అంతా ఎంతో కష్టపడ్డారు. జాగ్రత్తగా ఉండండి. మీ భద్రతే మా ప్రాధాన్యం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎమ్‌బీ` అని ట్వీట్ చేశాడు.