Abn logo
May 23 2020 @ 15:46PM

హ్యాపీ బర్త్‌డే మామయ్య: దర్శకేంద్రుడికి మహేష్ విషెస్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన `రాజకుమారుడు` సినిమాతో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా వెండితెర అరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే మహేష్‌కు రాఘవేంద్రరావు భారీ విజయం అందించారు. ఈ రోజు (శనివారం) రాఘవేంద్రరావు జన్మదినోత్సవం. 


ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా రాఘవేంద్రరావుకు మహేష్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. `హ్యాపీ బర్త్‌డే మామయ్య. మీలాంటి దిగ్గజ దర్శకుడితో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. `రాజకుమారుడు` షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోను షేర్ చేశాడు.  

Advertisement
Advertisement
Advertisement