May 7 2021 @ 10:55AM

నాని హీరోయిన్‌తో 'యాత్ర' దర్శకుడు

నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ'తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా మహి వి రాఘవ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈయన దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమాను రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాకి సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కించబోతున్నట్టు గత ఏడాది వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ యాత్ర 2కి ముందే శ్రద్ధా శ్రీనాథ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్న మహి వి రాఘవ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు కమెడియన్స్‌ను ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా తర్వాత యాత్ర 2, అలాగే టాలీవుడ్ యంగ్ హీరోతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట మహి వి రాఘవ.