మహిళల అక్రమ రవాణాపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-07-30T06:06:17+05:30 IST

మహిళల అక్రమ రవాణను నిరోధించటానికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

మహిళల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ప్రసంగిస్తున్న చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

పెదకాకాని: మహిళల అక్రమ రవాణను నిరోధించటానికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎన్‌యూలో గురువారం జరిగిన వెబినార్‌లో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.  సీఎం జగన్‌ ఆధ్వర్యంలో బాలికలు, మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పద్మశ్రీ సునీత కృష్ణన్‌ మాట్లాడుతూ ప్రస్తుతకాలంలో ఆన్‌లైన్‌, ఇతర సాధనాల ద్వారా మహిళల అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా సాగుతుందని చెప్పారు. అడిషనల్‌ ఎస్పీ సరిత మాట్లాడుతూ మహిళల అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలో యూనిట్లు ఏర్పాటు చేసిందన్నారు.  ఆపరేషన్‌ ముష్కాన్‌ ద్వారా అనేక మంది బాలికలను సురక్షిత స్థలాలకు చేర్చామని తెలిపారు. మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ సుయజ్‌ మాట్లాడుతూ వర్సిటీలు, కాలేజీల్లో యాంటీహ్యూమన్‌ ట్రాఫికింగ్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసి మహిళా కమిషన్‌ మార్గ నిర్దేశం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్‌, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ మెంబర్‌ సెక్రటరి చిన్నంశెట్టి రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి అనురాధ, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-07-30T06:06:17+05:30 IST