మహిళా మేట్లకు శిక్షణ

ABN , First Publish Date - 2021-10-28T03:39:28+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మహిళా మేట్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మహిళా మేట్లకు శిక్షణ
శిక్షణలో మాట్లాడుతున్న ఈసీ సుప్రజ

మనుబోలు, అక్టోబరు 27: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మహిళా మేట్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డ్వామా ఏపీడీ శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ గతంలో ఉపాధి కూలీల సంఘాలకు మగవారు మాత్రమే మేట్లుగా ఉండేవారని, ప్రభుత్వ ఆదేశాలతో మహిళా కూలీలను మేట్లుగా ఎంపిక చేశామన్నారు. ఒక్కో సంఘంకు ఇద్దరేసి మహిళా మేట్లు ఉంటారన్నారు. మండలంలోని తొమ్మిది పంచాయతీల పరిధిలో 180మంది మహిళా మేట్లు ఉండగా.. 150మంది హాజరయ్యారు. వారికి  శిక్షణ ఇచ్చి ఉపాధి పనులపై అవగాహన కల్పించామన్నారు. ఇతర కూలీలను మేట్లుగా ఉన్న వారు పనులకు తీసుకురావాల్సిన బాధ్యతలు, వారికి కలిగే లబ్ధి, ఎంతమేర పనులు చేస్తే ఎంత కూలీ గిడుతుంది, వచ్చిన కూలీల నమోదు ఎలా చేయాలి అన్న విషయాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీవో వెంకటేశ్వర్లు, ఈసీ సుప్రజ, టీఏ రమేష్‌, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T03:39:28+05:30 IST