మహిళా పోలీసులను బలోపేతం చేస్తాం: ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-04T05:37:32+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసుల)ను బలోపేతం చేస్తామని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.

మహిళా పోలీసులను బలోపేతం చేస్తాం: ఎస్పీ

కర్నూలు, డిసెంబరు 3: గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసుల)ను బలోపేతం చేస్తామని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా ఎంపికైన 23 మందికి నియామక పత్రాలు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి మార్పు తీసుకువచ్చేందుకు గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎంపిక చేశామన్నారు. మెరిట్‌ ఆధారంగా వచ్చిన ర్యాంకుల ప్రాధాన్యంతో కౌన్సెలింగ్‌ నిర్వహించారన్నారు. డీపీవో ఏవో సురే్‌షబాబు, ఎ-సూపరింటెండెంట్‌ వాసుదేవ్‌ పాల్గొన్నారు. 



పోలీసు కుటుంబాలకు భద్రతా చెక్కులు

 జిల్లా పోలీస్‌ శాఖలో పని చేస్తూ మృతి చెందిన పోలీసు కుటుంబాలకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప భద్రతా చెక్కులను గురువారం అందజేశారు. నంద్యాల ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో పని చేస్తూ ఆగస్టు 27 న అనారోగ్యంతో మృతి చెందిన ఎస్‌ఐ కె.మౌలపీరా భార్య ఖాజాబీకి రూ.8 లక్షలు, కర్నూలు త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో పని చేస్తూ మృతి చెందిన పీసీ పి.ఆనందరాముడు భార్య విజయలక్ష్మికి రూ.4 లక్షల భద్రతా చెక్కులను ఎస్పీ అందజేశారు.  ఏవో సురే్‌షబాబు, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:37:32+05:30 IST