తెలంగాణలో మహీంద్రా ఈ-సెంటర్లు

ABN , First Publish Date - 2020-10-28T08:15:50+05:30 IST

తెలంగాణ రైతాంగానికి అధునాతన వ్యవసాయ సాం కేతిక విధానాలు అందించేందుకు మహీంద్రా గ్రూప్‌ సిద్దమైంది. గ్రూప్‌ ప్రధాన కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ అనుబంధ ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ సెంటర్...

తెలంగాణలో మహీంద్రా  ఈ-సెంటర్లు

హైదరాబాద్‌: తెలంగాణ రైతాంగానికి అధునాతన వ్యవసాయ సాం కేతిక విధానాలు అందించేందుకు మహీంద్రా గ్రూప్‌ సిద్దమైంది. గ్రూప్‌ ప్రధాన కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ అనుబంధ ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ సెంటర్‌ (ఎఫ్‌ఈఎస్‌) ఇందుకోసం రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడ, కామారెడ్డిల్లో ‘కృషి ఈ సెంటర్లు’ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా  తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తికి అవసరమైన అధునాత సాంకేతిక సేవలను రైతులకు అందిస్తుంది. ‘ఫార్మింగ్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ పేరుతో కంపెనీ ఈ వ్యాపారం ప్రారంభించింది. కృత్రిమ మేధ (ఏఐ), ఐఓటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందించనున్నట్టు తెలిపింది. ఈ సేవల ద్వారా రైతుల ఆదాయం పెంచాలన్నది తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. ఈ కృషి ఈ కేంద్రాల ద్వారా అందుబాటు ధరల్లో రైతులు అధునాతన డిజిటల్‌ ఆధారిత వ్యవసాయ సేవలు అందుకోవచ్చని మహీంద్రా గ్రూపు ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ సెంటర్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ సిక్కా చెప్పారు. 

Updated Date - 2020-10-28T08:15:50+05:30 IST