94 శాతం తగ్గిన మహీంద్రా లాభం

ABN , First Publish Date - 2020-08-08T06:28:21+05:30 IST

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఏకంగా 94 శాతం పడిపోయి రూ.54.64 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 894.11 కోట్లుగా ఉంది...

94 శాతం తగ్గిన మహీంద్రా లాభం

న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఏకంగా 94 శాతం పడిపోయి రూ.54.64 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 894.11 కోట్లుగా ఉంది. కాగా సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.26,041.02 కోట్ల నుంచి రూ.16,321.34 కోట్లకు పడిపోయింది.  కరోనా ప్రభావం, వరుస లాక్‌డౌన్‌లు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని కంపెనీ సీఎ ఫ్‌ఓ అనీశ్‌ షా తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2020-21లో మూలధన పెట్టుబడులను రూ.12,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లకు తగ్గించినట్లు షా పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-08T06:28:21+05:30 IST