అమాయకంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు మహిళలు చేసిన పాడు పని ఇది.. రాత్రి 10.30 గంటలకు..

ABN , First Publish Date - 2021-10-15T13:15:24+05:30 IST

అమాయకంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు మహిళలు చేసిన పాడు పని ఇది.. రాత్రి 10.30 గంటలకు..

అమాయకంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు మహిళలు చేసిన పాడు పని ఇది.. రాత్రి 10.30 గంటలకు..

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక సబ్బుల కంపెనీ యజమాని ఇంట్లో సుమారు రూ.50 లక్షల దొంగతనం జరిగింది. ఆ దొంగతనం కేసు విచారణ చేసిన పోలీసులు నిందితుల గురించి తెలుసుకొని విస్తుపోయారు. అసలు ఏం జరిగిందంటే..


జైపూర్‌లో సబ్బుల కంపెనీ యజమాని యజమాని అయిన వీరేంద్ర జైన్ ఇంటికి అక్టోబర్ 13న ఉదయం పాలు వేయడానికి పాలవాడు వచ్చాడు. అతను ఎంతసేపు గేటు వద్ద బెల్ కొట్టినప్పటికీ ఎవరూ రాకపోవడంతో గేటులోనుంచి తొంగి చూశాడు. లోపల నేల మీద ఇద్దరు వ్యక్తులు శవాలుగా పడిఉండడం చూసి పాలవాడు భయపడ్డాడు. ఇరుగు పొరుగు వారిని పిలిచి చూపించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని గేటు తాళం పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లో పనిచేసే ఇద్దరు పనివాళ్లు నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారు ఎంతసేపటికీ లేవకపోగ వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు అనుమానించారు. ఇంటి యజమాని ఇంట్లో లేరని, బంధువుల పెళ్లి కోసం కుటుంబ సమేతంగా లుధియానా వెళ్లారని తెలిసింది. పోలీసులు ఇంటి యజమాని వీరేంద్ర జైన్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. 


పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేశారు. సబ్బుల కంపెనీ యజమాని వీరేంద్ర జైన్ అక్టోబర్ 12వ తేదీన తన బంధువుల పెళ్లి కోసం కుటుంబసమేతంగా లుధియానా వెళ్లారు. ఇంట్లో ముగ్గురు పని మనుషుల వదిలి వెళ్లారు. ఆ ముగ్గరిలో ఒకరు చాలా నమ్మకస్తురాలైన కాంత(45), కొత్త పని మనిషి సంగీత(28), మరొక యువకుడు బబ్లూ(22) ఉన్నారు. పోలీసులకు పాలవాడు సమాచారం అందించనే వెంటనే వారు అక్కడికి చేరుకోగా కేవలం కాంత, బబ్లూ మాత్రమే ఉన్నారు. సంగీత కనబడలేదు. ఇంట్లో రెండు గదులలో నుంచి నగదు, బంగారు ఆభరణాలు కలపి సుమారు రూ.50 లక్షల దొంగతనం జరిగిందని అంచనా వేశారు.


ఆస్పత్రిలో ఉన్న కాంత, బబ్లూకు మెలుకవరావడంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. రాత్రి భోజనం తిన్న తరువాత వారికి మత్తు లాగా అనిపించిందని. వారితో కలిసి సంగీత భోజనం చేయలేదని చెప్పారు. రాత్రి 10.30 గంటలకు ఇంట్లో ఇద్దరు యువకులు, ఒక మహిళ ముఖం కప్పుకొని చొరబడ్డారని, ఆ తరువాత వారిని ఎదిరించబోయి కింద పడిపోయామని.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదని చెప్పారు.


అప్పుడు పోలీసులకు సంగీత గురించి అనుమానం వచ్చింది. ఆమెను ఢిల్లీలో పని మనుషులను సరఫరా చేసే ఒక ఏజెన్సీ పంపించిందని ఇంటి యజమాని చెప్పారు. పోలీసులు వెంటనే ఆ ఏజెన్సీ వారిని విచారణ చేయగా ఆమెను గంగ అనే పాత పనిమనిషి పంపించిందని తెలిసింది. గంగ కూడా కొన్ని రోజుల ముందు వరకు వీరేంద్ర జైన్ ఇంట్లో పనిచేసేదని తెలిసి పోలీసులు విస్తుపోయారు. 


ఇదంతా గంగ వేసిన ప్లాన్ అని పోలీసులకు అనుమానం వచ్చింది. గంగ గురించి వీరేంద్ర జైన్‌ని పోలీసులు ప్రశ్నించారు. గంగ నేపాల్‌ నుంచి వచ్చిందని, తన ఇంట్లో గత కొంత కాలం పనిచేసిందని, ఆ తరువాత హఠాత్తుగా పని మానేసి వెళ్లిపోయిందని వీరేంద్ర తెలిపారు. అంటే గంగ ఇంతకాలం ఇంటిని బాగా పరిశీలించి, యజమాని డబ్బు, నగలు ఎక్కడ పెడతారో తెలుసుకుంది. ఆ తరువాత పని మానేసి తన స్థానంలో సంగీతను ఆ ఇంట్లో చేర్చింది. యజమాని తన కుటుంబంతో సహా పెళ్లికి వెళుతున్నారని, ఇంట్లో పని మనుషులు మాత్రమే ఉంటారని సంగీత సమాచారం అందించింది. ఆ రోజు రాత్రి కాంత, బబ్లూకి సంగీత మత్తు కలిపిన భోజనం ఇచ్చింది. అలా వారిద్దరినీ దారి నుంచి సునయాసంగా తప్పించింది.


రాత్రి 10.30 గంటలకు గంగ, మరో ఇద్దరు దుండగులు పక్కా ప్లాన్‌తో ఇంట్లో చొరబడి లాకర్లలో ఉన్న నగదు 15 లక్షలు, బంగారం సుమారు 35 లక్షలు దొంగిలించారు. ఆ తరువాత వెంటనే బ్యాగులు తీసుకొని పారిపోయారు. వారు పారపోతుండగా పక్కింటి సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం గంగ, సంగీత, ఇద్దరు గుర్తు తెలియని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-15T13:15:24+05:30 IST