బుల్లి బాయ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-07T02:36:16+05:30 IST

20 ఏల్ల నీరజ్ బిష్ణోయి రూపొందించిన ఈ బుల్లి బాయ్ యాప్‌లో ముస్లిం మహిళల్ని అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. ముస్లిం మహిళల ఫొటోలను ఎడిట్ చేసి, వాటి ముఖాలను మార్పింగ్ చేసి ఇందులో..

బుల్లి బాయ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ముంబై: దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి ముందు సోషల్ మీడియాలో కొత్త ఎత్తుగడలతో పోలీసులను గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు నీరజ్. ట్విట్టర్‌తో తనకు అంతకు ముందున్న ఖాతాను తొలగించి, కొత్త ఖాతాల తెరిచి.. సదరు యాప్ రూపకర్తను తానే అంటూ కొత్త నాటకం ఆడబోయాడు. అయితే ఈ ఖాతా కూడా అతడిదేనని పోలీసులు గర్తించారు.


20 ఏల్ల నీరజ్ బిష్ణోయి రూపొందించిన ఈ బుల్లి బాయ్ యాప్‌లో ముస్లిం మహిళల్ని అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. ముస్లిం మహిళల ఫొటోలను ఎడిట్ చేసి, వాటి ముఖాలను మార్పింగ్ చేసి ఇందులో అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో ప్రధాన నింధితుడు నీరజ్ బిష్ణోయినే. ఇతడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నాడు. కాగా, ఇతడిని బుధవారం అస్సాంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీకి తీసుకువచ్చి విచారిస్తున్నారు.


అయితే ఇదే కేసులో ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరి వయసు కూడా బిష్ణోయ్‌కి అటుఇటుగానే ఉంటుంది. అయితే వారిద్దరినీ ఈ కేసు నుంచి తప్పించేందుకు బిష్ణోయ్, తాను అంతకు ముందు వాడిన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసి, కొత్త ఖాతాను సృష్టించి.. అందులో నుంచి యాప్ తయారు చేసింది తానేనని, ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్న ఇద్దరికి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పుకొచ్చాడు. అయితే డిలీట్ చేసిన ఖాతాతో పాటు కొత్త వాడుతున్న ఖాతా కూడా బిష్ణోయ్‌దేనని పోలీసులు గుర్తించారు.





Updated Date - 2022-01-07T02:36:16+05:30 IST