పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి

ABN , First Publish Date - 2022-01-20T03:15:59+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ డీఈవో కే. వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం స్థానిక మోడల్‌ స్కూల్‌, జడ్పీ ఉన్నత పాఠశాల, పెట్లూరు హైస్కూళ్లను ఆయన పరిశీలించారు.

పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి
బాత్‌ రూంలు పరిశీలిస్తున్న డిప్యూటీ డీఈవో కే. వెంకటేశ్వరరావు

డిప్యూటీ డీఈవో కే. వెంకటేశ్వరరావు

వెంకటగిరి(టౌన్‌), జనవరి 19: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ డీఈవో కే. వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం స్థానిక మోడల్‌ స్కూల్‌, జడ్పీ ఉన్నత పాఠశాల, పెట్లూరు హైస్కూళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  భౌతిక దూరం, మాస్క్‌లు, ఘా కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని విద్యా ప్రమాణాలు కూడా మెరుగు పడేలా కృషి చేయాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావాలని కోరారు. మెనూలో నాణ్యత  పాలించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో టీ. వెంకటేశ్వర్లు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అపర్ణ, వల్లభదాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T03:15:59+05:30 IST